---Advertisement---

అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి

---Advertisement---

 

– కీలకంగా వ్యవహరిస్తున్న ప్లానర్ల పై సైతం విచారణ జరిపించాలి
– జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్

ఖమ్మం రూరల్ మండలంలో భవన నిర్మాణ అనుమతుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ ఉన్నత స్థాయి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో స్పందించారు… ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు అన్నారు. పారదర్శకంగా ఇవ్వాల్సిన అనుమతుల్లో అవినీతి వసూళ్లకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే పన్నుల ద్వారా జీతాలను పొందుతూ.. మరలా వారి కష్టార్జితాన్ని ఈ విధంగా దోపిడీ చేయడం దారుణమైన అంశంగా పేర్కొన్నారు. అధికారుల అవినీతి వల్లనే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని ఆరోపించారు. ఈ నిర్మాణాలు అధికారుల ఆమ్యామ్యాల వల్లనే జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అనుమతుల మేరకు ఎక్కడ నిర్మాణాలు జరగడంలేదని, పట్టించుకోవాల్సిన అధికారులు ఉధాసీనత కనబరచడంలో ఆంతర్యం ఏమిటో అర్థమవుతుందన్నారు. అవినీతి వసూళ్లకు పాల్పడుతున్న అధికారి ప్లానర్ల ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు . పర్మిషన్లు తీసుకునే వారిలో ఎవరిని కదిలించిన ప్లానర్ల గురించే వివరిస్తున్నారు . సారుకు డబ్బులు ఇస్తే పర్మిషన్ వస్తుందని బహిరంగంగానే అడుగుతుండడం వారి అవినీతికి అద్దం పడుతుందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డిపిఓ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment