*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై చర్యలు తీసుకోవాలి*
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు మేము రాండం అందజేసిన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
ఏఐసీసీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి రాసిన మెమోరాండం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి అందించిన మల్కాజిగిరి మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంత్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిండు పార్లమెంటు సభలో బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, నువ్వు ఈరోజు మంత్రిగా ఉన్నావంటే, అది అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల వలన మాత్రమే అన్నది గమనించాలి. కానీ, భారతదేశంలో మనువాదాన్ని వ్యాప్తి చేసేందుకు, అంబేడ్కర్ వాదుల్లో పెరుగుతున్న చైతన్యాన్ని అణగదొక్కడానికి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజాస్వామ్యానికి అవమానకరం, ప్రమాదకరం.అమిత్ షా తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజి రెడ్డి, దుబాక నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరి క్రిష్ణ, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ టిపీసీసీ రాష్ట్ర నాయకుడు సుప్రభాత్ రావు,పల్లె రామచంద్ర గౌడ్, సురేందర్ గౌడ్, ఆంజనేయులు గౌడ్,మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.