ఆదాని,అంబానీలకే దేశ సంపద.
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆదాని అంబానీలకు దేశ సంపదలను కట్టబెడుతున్నదని సిపిఎం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా మూడో మహాసభ సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల పక్షాన నిలబడుతున్నదని ఒక్క ఆదానికే 16 వేల కోట్ల రూపాయల్ని కట్టబెట్టిందని ఆరోపించారు. పేదవాడి కి తిండి లేక జీవనం కొనసాగిస్తుంటే, పెట్టుబడుదారులు భూస్వాములు రోజురోజుకు సంపన్నులుగా పెరుగుతున్నారని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మన ధర్మ శాస్త్రాన్ని దేశంలో అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసేందుకే బిజెపి ఉన్నది తప్ప పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం లేదని విమర్శించారు.యూనివర్సిటీలలో జడ్జిల నియమాకాలలో ఆర్ఎస్ఎస్ బిజెపి తలదూరుస్తుందని అందులో భాగమే జడ్జిలు వెళ్లి ఆర్ఎస్ఎస్ మీటింగ్లలో పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. పార్టీలు ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారని అన్నారు. బిజెపి రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు బిజెపి మతోన్మాద చర్యలు టిఆర్ఎస్ అధికార దాహంతో చేసే చర్యలు తెలంగాణలో సాగనివ్వమని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాడుతామని ఈ మహాసభల్లో అటువంటి తీర్మానాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, సాగర్, రాష్ట్ర నాయకులు భూపాల్, వెంకట్, రాములు, ధర్మ నాయక్, జిల్లా కార్యదర్శి పర్వతాలు కార్యదర్శులకు సభ్యులు దేశనాయక్ ఆర్ శ్రీనివాస్ కే. గీత బి ఆంజనేయులు శ్రీ ఆంజనేయులు జిల్లా నాయకులు మల్లేష్ శంకర్ నాయక్ నిర్మల డివిజన్ నాయకులు శివకుమార్ రాములు సైదులు తదితరులు పాల్గొన్నారు.