ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన
జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్ఐ సిఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment