ఉప రాష్ట్రపతి రాకతో ముందస్తు ఏర్పాట్లు

ఉపరాష్ట్రపతి రాకతో ముందస్తు ఏర్పాట్లు

_క్షేత్రస్థాయిలో పరిశీలించిన పర్సనల్ సెక్రటరీ శ్రీదేవ్ భరద్వాజ్_

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని తునికి శివారులో గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి ఈనెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కాడ్ రానుండడంతో మంగళవారం పర్సనల్ సెక్రటరీ,టూ అండరబుల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవ్ భరద్వాజ్, సీనియర్ పిఎస్ విజ్ఞాన కేంద్రానికి విచ్చేసి నిర్వాహకులతో ముందస్తు ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటల వివరాలు రైతులతో రాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెలిప్యాడ్, మీటింగ్ డాష్ ప్లాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉపరాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండింగ్ అనంతరం మొదటగా ఎగ్జిబిషన్ పరిశీలించి సమావేశంలో పాల్గొనున్నారు ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి రైతులతో సుమారు ఒక గంట ముఖాముఖి మాట్లాడనున్నట్టు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నాగేష్, ఎస్ బి సి ఐ సందీప్ రెడ్డి, తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, కౌడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి, ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ ఆంజనేయులు, కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు,కెవికె చైర్మన్ డాక్టర్ పి వి రావ్, సీనియర్ సైంటిస్ట్ కెవికె హెడ్ డాక్టర్ సంబాజీ దత్తాత్రేయ నల్కర్, సెక్రటరీ శ్రీరామచంద్రమూర్తి, తోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment