---Advertisement---

‘ఏకలింగం కాదు.. ఏకే 47’

---Advertisement---

కాంగ్రెస్​ చెప్పేవన్ని కల్లబొల్లి మాటలే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ఘనత జగదీష్ రెడ్డిదే..
మాజీ ఎంపీ, బీఆర్ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య

సూర్యపేట జిల్లా, డిసెంబర్ 08 (తెలంగాణ కెరటం): కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీస్తోందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ఘనత జగదీష్ రెడ్డిదే అని అన్నారు. ‘ఏకలింగం కాదు.. కాంగ్రెస్ పాలిట ఆయన ఏకే. 47..’ మెడికల్ కళాశాలలు తెచ్చిందెవరో ప్రజలకు తెలుసుకోవాలని గుర్తు చేశారు. బీఆర్​ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్లు కాంగ్రెసే హడావిడి చేస్తోందని అన్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు, మెడికల్ కళాశాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. గత 10 ఏండ్లలో రాష్ట్రంలో కెసీఆర్, ఉమ్మడి జిల్లాలో జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎవరిని అడిగినా చెబుతారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల వల్ల ఒరిగిందేమీ లేదనికూడా ప్రజలు చెబుతారని ఎద్దేవ చేశారు. అధికారంలో ఉండికూడా నోరు అదుపులో పెట్టుకోకపోతే నవ్వులపాలయ్యేది మీరేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలు. కల్లబొల్లి మాటలతో ఇంకా ఎంతకాలం వెళ్లబుచ్చుతారో వేచి చూడాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నెమ్మాది బిక్షం, తూడి నర్సింహా రావు, బూర బాలసైదులు గౌడ్, ఆకుల లవకుశ, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment