హెచ్ఐవీ పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీత రాణి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 30 : ప్రజలు, హెచ్ఐవి (ఎయిడ్స్) పట్ల అప్రమత్తంగా ఉండాలని, హెచ్ఐవీ వ్యాధి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత రాణి వైద్య సిబ్బందికి సూచించారు. డిసెంబర్ 01 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను పురస్కరించుకొని శనివారం గోడ పత్రికలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ ప్రజలు హెచ్ఐవీ (ఎయిడ్స్) పై అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫీషీయన్సీ వైరస్ (మానవుని శరీరం రోగనిరోధక శక్తిని క్షీణీంప చేయునది) ద్యారా వస్తుందని, వాడినప్పుడు గానీ, సిరంజీలు తిరిగి వాడినా, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారి బ్లడ్ ఇతరులకు ఎక్కించినప్పుడు, పాజిటివ్ ఉన్న తల్లి నుంచి బిడ్డకు ఇది సంక్రమిస్తుందన్నారు. ఇందుకు నివారణ ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో తిరిగినా, కలిసి భోజనం చేసినా, కరచాలనం చేసినా, వారి వాడిన వస్తువులు మనం తాకీనా హెచ్ఐవీ రాదని, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఏఆర్ టి సెంటర్ ద్వారా ఉచిత ముందులతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ జీవితాంతం జీవించవచ్చని తెలిపారు. 2030 నాటికి హెచ్ఐవీ లేని సమాజం స్థాపనే మన అందరి లక్ష్యమని విధంగా ప్రజలందరికీ అవగాహన కల్పించి సమాజం ఆరోగ్యానికి తోడ్పడాలని తెలిపారు. హెచ్ఐవీ బాధితులను అందరితో సమానంగా చూడాలని సూచించారు. ఈ నెల 30,వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఐసిటిసి సిబ్బంది, ఎస్ఎస్ కె సిబ్బంది, వైద్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ట్రేని ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.