మాలల అభివృద్ధి ఐక్యత కోసం మాల సమాజమంతా ఏకం కావాలి
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 29:
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలోని మాల సంక్షేమ భవనంలో మాల సామాజిక వర్గ విస్తృతస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ అంగరి ప్రదీప్ పాల్గొని మాలల అస్తిత్వం ఆత్మగౌరవం ఐక్యత అభివృద్ధి కోసం మాల సమాజమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. జనవరి రెండవ తేదీన నిజామాబాద్ జిల్లాకు విచ్చేయుచున్న ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ షామిమ్ అక్తర్ కమిటీ కి నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల మాల ప్రజలు వచ్చి రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వినతులు ఇవ్వాలని సూచించారు. అనంతరం రాబోయే రోజుల్లో మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న రాజకీయ పార్టీలపై పోరాటానికి మాలలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు భీంగల్ మరియు పరిసర 20 గ్రామాలలోని మాల యువతతో గ్రామ మరియు మండల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులంతా ముక్తకంఠంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తీరుపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో భీంగల్ మండల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బట్టు అనిల్, బీమా రవీందర్,మేకల శ్రీనివాస్,డిఎస్ రవీందర్,గంట భాగేష్, చిత్తరి ఆనంద్, రామ్, డి సురేష్,బట్టు సునీల్, మొండి దినేష్, బద్దం రంజిత్,కునా రమేష్, రాహుల్, డి మురళి, బద్దం అవినాష్, మరియు వివిధ గ్రామాలకు చెందిన మాల యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.