తొక్కిసలాట దురదృష్టకర ఘటన: అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో ఎవరి తప్పూ లేదని ప్రెస్ మీట్లో చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండటం బాధిస్తోందన్నారు.