అంబేద్కర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించండి.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా డిసెంబర్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం స్థానిక ఖమ్మం క్రాస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మాజీ గ్రంధాలయ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ లగిచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు విలాసవంతమైన టూర్లలో ఊరేగుతున్నారని విమర్శించారు. లగిచర్ల గిరిజన రైతుల భూములను లాక్కుంటుంటే ఇదేమిటని భూములు మీకిస్తే మేమెట్ల బతకాలి అన్నందుకు వారిపై కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా కోర్టులో అడ్డుకుంటున్నారని అన్నారు. గత మూడు నెలలుగా గిరిజన రైతులను చిత్రహింసలకు గురి చేస్తే హీర్యానాయక్ అనే రైతుకు చాతినొప్పి వస్తే బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్ళిన ప్రభుత్వ చెష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. లగిచర్ల గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్‌రెడ్డిలు వెంటపడి నిలదీస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తి వేసేలా జ్ఞానోదయం కలిగించాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ఆత్మకూర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహ్మరావు, బత్తుల రమేష్, కొణతం సత్యనారాయణరెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, చింతలపాటి మధు, వీరస్వామి, కిషనానాయక్, శ్రీనివాస్‌డ్డి, ఈదుల యాదగిరి, షకీల్, మీనయ్య తదితరులు ఉన్నారు.