“”అమిత్ షా రాజీనామా చేసేవరకు”” అంబేద్కర్ యువజన సంఘాల తీవ్ర ఉద్యమం
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 29:
ఇటీవల ప్రజాస్వామ్యానికి మందిరమైన రాజ్యసభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను అవమాన పర్చిన కేంద్రమంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చెయ్యాలని అంబేడ్కరైట్లు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం (ఎ.వై.ఎస్) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని భీంరావు అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఎ.వై.ఎస్ నిజమాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న (డి.ఎల్ మాలజీ) మాట్లాడుతూ అమిత్ షా తమ మనుసులో ఉన్న విషం కక్కారని, అంబేడ్కర్ బావజాలన్ని వ్యతిరేకించే అర్.ఎస్.ఎస్ మాట తన నోట వచ్చిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ఈ విషపూరిత ఆలోచన విధానం అంతమైతదని, కేవలం దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీల విముక్తి సిద్ధాంతమైన ఫూలే అంబేడ్కరిజమే అజేయమని లింగన్న ఎలుగెత్తి చాటారు. ఆరంభంలో కార్యకర్తలందరు భారత “రాజ్యాంగ పీఠిక” ను సామూహికంగా చదివారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎ.వై.ఎస్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ, జర్నలిస్ట్ సామ్రాట్ అశోక్, మామిడి రాజు, ప్రఖ్యాత విశ్వకవి కవిరాజా, పలిగిరి సుభాష్, చాకలి పెద్దోళ్ల రాజేశ్వర్, చింతలసంద లింగన్న చాకలి, గండ్లపేట సత్యనారాయణ, బత్తుల నడ్పీ గంగారాం, మూలనివాసి మాలజీ తదితర్లు పాల్గొన్నారు.