రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఏఎంసీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి
తెలంగాణ కెరటం నవంబర్ 30 ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని ప్రభుత్వం రైతుల కొరకు కొనుగోలు సెంటర్లు ప్రారంభించామని రైతులు పండించిన తమ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని ఏఎంసీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతుల పండుగ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి మార్కెట్ కమిటీ పాలకవర్గంతో కలిసి ఘనంగా నిర్వహించారు అనంతరం ఏఎంసి చైర్మన్ గోపిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని అందుకు నిదర్శనం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడమైనది అని తెలిపారు రైతులు పండించిన పంటను దళారును ఆశ్రయించి మోసపోవద్దు అని పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో విక్రయించి మద్దతు ధర పొందాలని వరి ధాన్యానికి 2320 మద్దతు ధర ఉన్నదని సన్నారకానికి 500 రూపాయలు ప్రభుత్వం బోనస్ అందిస్తున్నారు అని ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు పత్తి రైతులు తమ పత్తిని ప్రభుత్వం ప్రారంభించిన సిసిఐ కొనుగోలు జిన్నింగ్ మిల్లులో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర 7520 రూపాయలు పొందాలని కోరారు ఈ సందర్భంగా రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశి లకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి మాట్లాడుతూ రైతులు గత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డారని క్వింటాల్కు వరి ధాన్యానికి ఆరేడు కిలోలు కటింగులు విధించారని మిల్లు వద్దకు పోతే అక్కడ కూడా తప్పతాలి పేరుతో రెండు మూడు కిలోలు కట్ చేశారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతులకు ఎలాంటి కటింగు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు జరుపుతుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయడమే కాకుండా రైతులు పండించిన వరి సన్న రకం 500 రూపాయల బోనస్ అందిస్తున్న గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావుకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు మహిపాల్ రెడ్డి సప్ప లింగయ్య శ్రీనివాస్ వెలగటూర్ మాజీ ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి గుమ్మల వెంకటేష్ లక్ష్మణ్ పాసిగామ మాజీ సర్పంచ్ అల్లం బుచ్చయ్య కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రమేష్ మార్కెట్ కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు