అమిత్ షా క్షమాపణ చెప్పాలి
నందిగామ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు శివగాళ్ల సుమన్
నందిగామ డిసెంబర్ (తెలంగాణ కెరటం
బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి అమీషా చేసిన వ్యాఖ్యలను నందిగామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శివగాళ్ల సుమన్ ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ను విమర్శించిన అమిత్ షా పై వెంటనే చర్యలు తీసుకోవాలి, తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని మహనీయుని గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు