డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాను క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలి .

డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాను క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలి .

బిజెపి కార్యాలయాన్ని ముట్టడించిన మాల మహానాడు నాయకులు .

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

పార్లమెంటులో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కోరుతూ మాల సంఘాల జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయాన్ని సూర్యాపేట జిల్లా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం మాట్లాడుతూ ప్రపంచానికే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను కించపరిచేలా దూషించడం అమిత్ షా అహంకారానికి నిదర్శనం అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమిత్ షాను కేంద్ర హోమ్ మంత్రి పదవి నుంచి తొలగించాలని లేనిచో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆందోళన నిర్వహిస్తున్న మాల మహానాడు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జేఏసీ జిల్లా నాయకులు బొల్లెద్దు దశరథ, కట్టా సైదులు, కట్ల మురళి, బుల్లెద్దు వినయ్, అశోద రవి ,బొప్పని అనిల్, చెవుల నాగరాజు ,జంగం కర్ణాకర్, వికాస్, అనుముల పూరి కృష్ణ, కోడి రెక్క సుధాకర్, జిల్లామహిళ సంఘం అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ బోయిళ్ళ అరుణ, బొప్పనీకవిత నాగేంద్ర, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment