---Advertisement---

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి 

---Advertisement---

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 22

:.అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటం కృష్ణ మల్లన్న అన్నారు. ఈ సంధర్బంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రకు నిదర్శనమన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను అవమానించిన బీజేపీ పార్టీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అవహేళనగా మాట్లాడుతూ దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించి. పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా సహించేది లేదని అన్నారు. అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, ప్రపంచ మేధావి అంబేద్కర్ ను అవమానించే హక్కు మీకు లేదని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నతమైన పదవి అనుభవిస్తున్నారని తెలిపారు. ఆ మహానుభావులు పెట్టిన బిక్షని మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. డా.అంబేద్కర్ ను కించపరిచి మాట్లాడినందుకు అమితాషా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలోని దళిత బహుజన సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment