భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 27): భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సమగ్ర శిక్ష ఉద్యోగులు సంతాపం వ్యక్తపరుస్తూ మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయసి అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత గల వ్యక్తి మన్మోహన్ సింగ్ అని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఆశయానికి ఆదర్శమని అన్నారు శుక్రవారం 18వ రోజుకు చేరుకున్న కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను భారతదేశ ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు అని అన్నారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ చిరస్మరణీయులు, ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఆశయానికి ఆదర్శం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష నాయకులు ప్రకాష్, అశోక్, సమ్మెలో పాల్గొన్న నాయకులు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 27):

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సమగ్ర శిక్ష ఉద్యోగులు సంతాపం వ్యక్తపరుస్తూ మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయసి అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత గల వ్యక్తి మన్మోహన్ సింగ్ అని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఆశయానికి ఆదర్శమని అన్నారు శుక్రవారం 18వ రోజుకు చేరుకున్న
కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను భారతదేశ ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు అని అన్నారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ చిరస్మరణీయులు, ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఆశయానికి ఆదర్శం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష నాయకులు ప్రకాష్, అశోక్, సమ్మెలో పాల్గొన్న నాయకులు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment