---Advertisement---

గుర్తు తెలియని శవం లభ్యం 

---Advertisement---

గుర్తు తెలియని శవం లభ్యం

 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 30:

 

ఈరోజు తొమ్మిది గంటల సమయంలో ఉగ్రవాయి గ్రామ శివారులోని హై టెన్షన్ వైర్లకు సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయినాడని సమాచారం రాగా అక్కడికి వెళ్లి పరిశీలించగా అతని వయసు సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. చేతుపై కుడి చేతి మణికట్టుపైన ఎ ఎ అనే పచ్చబొట్టుతో పాటుగా ఎడమచేతి చూపుడు వేలకి రింగు అదే విధంగా ప్లాస్టిక్ బ్యాండేజ్ మొలతాడు ఎడమ చేతికి కట్టి ఉన్నాయి. ఎడమ చెవికి పోగు కూడా కలదు. అదేవిధంగా ఈ వ్యక్తి లైట్ బ్లాక్ కలర్ జీన్స్ పాయింట్ బ్లూ కలర్ స్వెటర్ గ్రీన్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే దేవునిపల్లి పోలీస్ కి సమాచారం అందించగలరు. కామారెడ్డి రూరల్ సిఐ 8712686148 దేవునిపల్లి ఎస్ఐ 8712686150.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment