నేడు బేగంపేటలో ఆనందయ్య జాతర

నేడు బేగంపేటలో ఆనందయ్య జాతర 

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి మార్చి 13 :

 

మండలంలోని బేగంపేట గ్రామంలో సంగమేశ్వర ఆలయ సన్నిధిలో నిర్వహించే సద్గురు శ్రీ ఆనందయ్య జాతర మహోత్సవానికి గ్రామస్తులు అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా హోలీ పర్వదినాన జాతర ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దైవాంస సంబంధులైన శ్రీ సద్గురు ఆనందయ్య గ్రామ నడిబొడ్డున మఠం నిర్మించుకొని ఆవాసం ఉన్నారని, ప్రజలను పట్టిపీడించే మొండి వ్యాధులను నయం చేస్తూ, కష్ట సుఖాలలో తోడు నీడగా నిలిచారని పూర్వీకులు చెబుతారు. స్వయంగా శివ భక్తుడైన ఆనందయ్య మఠంను ఆనుకొని సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు, శివలింగాన్ని ప్రతిష్టించి ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించారని ప్రచారంలో ఉంది. లోక కళ్యాణార్థం మఠంలో సమాదైన సద్గురు ఆనందయ్యను గుర్తు చేసుకుంటూ, ప్రతి ఏటా హోలీ పర్వదినాన జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శివలింగానికి అభిషేకం, విశేష పూజలతో అలంకరిస్తారు. తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు వితరణ చేపడతారు. సాయంత్రం వేళ ఆలయం చుట్టూ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ తో పాటు వరంగల్ మెదక్, నాందేడ్, పూనే నుంచి భక్తులు, ఆనందయ్య శిష్యులు జాతరలో పాల్గొంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన సంగమేశ్వర ఆలయ సన్నిధిలో దాతల సహకారంతో విశ్రాంతి గదులు, విద్యుత్, ఇతర సౌకర్యాలు సమాకూర్చడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment