వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అన్న దాన కార్యక్రమం .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21.
సూర్యాపేట వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వాసవి వనిత గ్రూప్ సభ్యురాలు చల్ల వెంకన్న, అన్నపూర్ణమ్మ దంపతుల సహాయ సహకారాలతో చల్లా కనకయ్య గారి పేరు మీద. ఈ రోజు స్థానిక వాణిజ్య భవన్ సెంటర్లో కూలివారికి సుమారు 300 మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని మేము అడగకుండానే మాకు అందించినందుకు గాను అన్నపూర్ణ అమ్మవారి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి జెడ్ సి పసుపర్తి కృష్ణమూర్తి, కుసుమాంబ గ్రేటర్ క్లబ్ ట్రెజరర్ తేలుకుంట్ల వెంకన్న ,వాసవి కుసుమాంబ వైస్ ప్రెసిడెంట్ తోట హైమావతి పాల్గొనడం జరిగింది. సూర్యాపేట వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి , సెక్రటరీ వెంపటి విజయ , ట్రెజరర్ నల్లపాటి రమాదేవి పాల్గొన్నారు .