అధికారుల, రాజకీయ నాయకుల అండ ఉంటే ఏమైనా చేయొచ్చు

అధికారుల, రాజకీయ నాయకుల అండ ఉంటే ఏమైనా చేయొచ్చు

తెలంగాణ కెరటం కామరెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 7

– తోటి రైతులను ఇబ్బంది పెడుతున్న అన్నదమ్ములు

 

– రోడ్డు వెడల్పులో పోయిన స్థలాన్ని పక్కవారి భూమిలో నుండి తీసుకోవాలనుకుంటున్న అన్నదమ్ములు

 

– పక్క రైతులను నోటికి వచ్చినట్లు తిడుతూ దాడి చేస్తున్న వైనం

 

-పూర్వపు అద్దులను కాకుండా కొత్త హద్దులను చూపిస్తున్న సర్వేయర్

 

– గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా విద్యుత్ వినియోగం

 

– వారి దృష్టిలో పిల్లలు, వృద్ధులు సైతం ఒక్కటే

 

రాజకీయ నాయకుల అండ, ప్రభుత్వ అధికారుల అండ ఉంటే అన్నిటిని తారుమారు చేయొచ్చు అనే విషయాన్ని కామారెడ్డి మున్సిపల్ రెండో వార్డ్ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన వడ్ల కళావతి కుమారులు రమేష్, నాగరాజ్ అనే అన్నదమ్ములు నువ్వు ఏం చదువు పెడుతున్నావ్ ఏడ మీద రుజువు చేస్తున్నారు. గత 50, 60 సంవత్సరాలుగా వారి సొంత పొలం ఉండగా వారి పొలానికి రామేశ్వర్ పల్లె నుండి ఆరేపల్లికి వెళ్లే రోడ్డు గతంలో పశువుల ( ఎడ్ల ) బండి కూడా వెళ్ళనటువంటి రోడ్డు ఉండగా దానిని ప్రస్తుతం 60 ఫీట్ల రోడ్డుగా ప్రభుత్వ ఏర్పాటు చేసింది. దాంతో ఆ రోడ్డు వెంబడి ఉన్న ప్రతి ఒక్కరి పంట పొలాల నుండి కొంత స్థలం అట్టి రోడ్డుకు వెళ్లిపోయింది. ఈ విషయం గ్రామంలోని ప్రతి ఒక్కరికే కాకుండా ఆ రోడ్డు గుండ వెళ్లే ప్రతి ఒక్కరికి విషయం తెలుసు అయినప్పటికీ రామేశ్వర్ పల్లె గ్రామానికి చెందిన వడ్ల కళావతి కొడుకులు రమేష్, నాగరాజ్ అనే అన్నదమ్ములు వారి పక్క పొలం అయినటువంటి వారిని ఇష్టమొచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ, సుమారు 60 సంవత్సరాలు ఉన్న మహిళ అని చూడకుండా బూతులు తిడుతూ ఉండగా ఇదేమిటని అడిగిన ఆమె కుమారుడు సంతోష్ పై పిడిగుద్దులు గుద్ది చొక్కా చింపేసి దాడి చేయడమే కాకుండా, ఆ మహిళనే తన కొడుకులను చెప్పుతో కొట్టిందని వడ్ల కళావతి చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ( అడవారిపై చేయి చేసుకున్న అధికారులు మాట్లాడక పోవడం చాలా బాధాకరం అందులోనూ సీనియర్ సిటిజన్ అనే మర్యాద కూడా ఇవ్వకుండా దాడి చేయడం సిగ్గుచేటు )

పైగా వారి పొలంలో నుండి అక్రమంగా విద్యుత్తును వినియోగిస్తూ వారిపై దాడి చేయడం వారికి షరా మామూలైపోయింది. ఆ బాధితుల ఒక బాధితుడైన కుమ్మరి సుదర్శన్ గ్రామ పెద్ద మనుషులలో ఒకరు, తానే పది మందికి సమాధానం చెప్పవలసి ఉండగా ఇంకొకరితో తనకు గొడవ ఎందుకని ఇంట్లో వారికి సైతం నచ్చచెప్పుతూ వచ్చారు. చివరికి అతని పొలాన్ని దున్ని అతనిని కుంటివాడ నీవు ఏం చేస్తావురా అనే స్థాయికి వడ్ల కళావతి కొడుకులు వచ్చారు. ప్రస్తుతం వారు సర్వేలను తీసుకువచ్చి వారి ఇష్టం వచ్చినట్టుగా కొత్త రోడ్ కు రెండు ఫీట్ల దూరంలో హద్దు రాళ్లను ఏర్పాటు చేసి అక్కడ నుండి కొలిసి కుమ్మరి సుదర్శన్ పక్క వారి పొలంలో నుండి వస్తుందని ఆ సర్వేర్ చూపించి వెళ్లిన తర్వాత వడ్ల కళావతి కొడుకులు అక్కడ కడీలు పాతి రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఇక్కడ నుండి సర్వేర్ కొలిచి ఇచ్చాడని, మా వద్ద ప్రభుత్వ అధికారులు ఇచ్చిన కాగితం ఉంది అంటూ, మా భూమి ఉందంటూ వారిపై దాడికి దిగడమే కాకుండా ప్రసార మాధ్యమాల్లో సైతం అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుతూ ఉండడం పలువురికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

కుటుంబం పై దాడి చేసిన కేసులు కలే..

 

ఇట్టి భూమి విషయంలో గతంలో కుమ్మరి సుదర్శన్ కుటుంబ సభ్యులపై దాడి జరిగిన సమయంలో దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే అక్కడికి వచ్చి గ్రామంలో మాట్లాడుకుంటామని పెద్దమనుషులు చెప్పినట్టు వింటామని చెప్పి ఆ తర్వాత కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడిన ఇప్పటివరకు వారిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇందులో ఓ రాజకీయ నాయకుడి జోక్యం ఉండడంతో పోలీసుల సైతం పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

 

– చెట్ల కొమ్మలు కొట్టిన అటవీశాఖ అధికారులు పట్టించుకోలే

వడ్ల కళావతి కుమారులు రమేష్ , నాగరాజ్ లు వారి పొలంలోని బోరు వద్దకు వైరుని తీసుకువెళ్లే సమయంలో కుమ్మరి సుదర్శన్ కు సంబంధించిన చెట్లను నరికివేసిన సమయంలో అతని కుమారుడు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు. సదరు రాజకీయ నాయకుడు జోక్యం చేసుకోవడంతో ఇలాంటివి మరోసారి జరిగితే కేసులు పెడతామని అటవీశాఖ అధికారులు సైతం తప్పించుకున్నారు. ఈ విషయాలను ఆసరాగా తీసుకున్న సదరు వడ్ల కళావతి కుమారులు ఇష్టం వచ్చిన రెచ్చిపోతూ పక్క పొలం వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. కొలతల కొలిచే సర్వేర్లు కూడా గతంలో భూమి ఎక్కడ నుండి ఉండే ప్రస్తుతం ఎక్కడి నుండి ఉంది అని గ్రామస్తుల నుండి సమాచారం తీసుకోవాలి కానీ అలాంటిది ఇక్కడ జరగడం లేదు. వారు ఇష్టం వచ్చినట్టుగా మాకు ఆన్లైన్ లో చూపెడుతుంది అక్కడి నుండి హద్దులు చూపిస్తున్నామంటూ సదర్ రైతులను సైతం బెదిరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నక్షనే మీరు తప్పు పడతారా అంటూ అడిగిన వారికి సైతం వారు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ నక్ష కాదు ప్రజలు ప్రత్యక్షంగా చూసింది కూడా సాక్ష్యంగా తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment