కోరుట్లలో అంగరంగ వైభవంగా ఆరట్టు ఉత్సవం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 06 : కేరళ సంప్రదాయం ప్రకారం ప్రతి యేటా నిర్వహిస్తున్న అరట్టు మహోత్సవం కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో ఉన్న కోనేరులో అయ్యప్ప ఉత్సవ మూర్తికి పాలెపు రాంశర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు మంగళ స్నానాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామి ఉత్సవమూర్తి రథోత్సవం శోభయాత్ర ద్వారా దీక్షాపరుల పేట తుళ్ళి ఆటలతో, భజనలతో పట్టణ పురవీధుల నుండి అయ్యప్ప దేవాలయం వరకు నిర్వహించారు. అన్నప్రసాద దాతగా యాదగిరి వరప్రసాద్ రావు – ఉమారాణి దంపతులు వ్యవహారించారు..ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తోట రాజు, కోశాధికారి జుంబర్తి రమేష్, ఉపాధ్యక్షులు గట్ల ఆనంద్, నిమిషకవి నాగరాజు, తులసి కృష్ణ, సహాయ కార్యదర్శి కాసు క్రాంతి, గెల్లె శ్రీనివాస్, చలిగంటి వినోద్ కుమార్, గౌరవ సలహా సభ్యులు మరిపెళ్లి రవి గౌడ్, గడ్డం మధు, ముక్కెర చంద్రశేఖర్, బెజ్జరపు రాజు గాజంగి లక్ష్మీపతి మరియు గెల్లె గంగాధర్, అల్వాల శ్రీనివాస్, బొమ్మ రాజేశం, నేతి శ్రీకాంత్, వాన్కార్ రాజు, కల్లూరి సాయి, అయ్యప్ప దీక్షా పరులు పాల్గొన్నారు.