---Advertisement---

అధికారులు నిద్రపోతున్నరా?

---Advertisement---

పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?

వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నట్టు

వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకు? ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్, తెలంగాణ కెరటం, నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ మటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతు న్నారా? అంటూ తీవ్రంగా

స్పందించింది. వారంలో మూడుసార్లు వుడ్ పాయి జనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అంశమని సీజే జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారు. పిల్లలు చనిపోతే గానీ స్పందించరా? అంటూ

హైకోర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ మంటన నిదర్శనమని.. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియన్ గా తీసుకోవడం లేదంటూ తలంటింది. మటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరపున

న్యాయవాది హైకోర్టుకు తెలుపగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం సమయం ఎందుకని నిలదీసింది. హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పని చేస్తారా? అని నిలదీసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో

హాజరవుతారని హైకోర్టు చెప్పింది. అధికారులకు కూడా పిలున్నారని.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. ఘటనపై భోజ న విరామం తర్వాత పూర్తి వివ రాలు అందజేస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణా లు పాటించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిం చారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తరుచూ భోజనం వికటిస్తుం దని ప్రభాకర్ హైకోర్టు దృష్టిని తీసుకెళ్లారు. నారాయణపేట జిల్లా మానగూరు జడీ పాఠశాలలో మంగళవారం పదో పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడగా.. వెంటనే వారిని మక్తల్ ఆసుపత్రికి తరలిం చారు. పాఠశాలలో వారం వ్యవధిలోనే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఇంతకు ముందు 20న ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment