అయ్యప్ప భక్తులకు మహాశాస్త్ర సేవా సంఘం నుండి
అన్నప్రసాద వితరణకై వంట సామాగ్రి వాహనం ఏర్పాటు
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30
నిత్యం వేల సంఖ్యలో
శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు
మహాశాస్త్ర సేవా సంఘం ఆధ్వర్యంలో
చెంగనూరు రైల్వే స్టేషన్ దగ్గర అన్నప్రసాద వితరణకై వంట సామాగ్రితో హైదరాబాదు నుండి చెంగునూర్ కు
సరకులతో వెళ్లే వాహనాన్ని ప్రారంభిస్తున్న మహాశాస్తా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాజు గురుస్వామి మరియు ట్రస్ట్ మెంబర్ పేర మహేందర్ (లింగం ) గురుస్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే అయ్యప్ప భక్తులకు బోజన సౌకర్యం కల్పించాలని తలచి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.