స్థానిక పోరుకు ఏర్పాట్లు షురూ.!
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి 12 మంది అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 464 గ్రామ పంచాయతీల్లో 4,140 వార్డులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 6,59,338 మంది ఓటర్లు ఉన్నారు.