అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.l
తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి: డిసెంబర్
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం నమ్మదగిన సమాచారం మేరకు ఇంఫోర్మెంట్స్ అధికారులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండలంలోని వడ్డేపల్లి సమీపంలోని దొడ్లపల్లి శివారులోని రేషన్ బియ్యం బొలెరో వాహనాన్ని పట్టుకొని తనిఖీ చేయగల అందులో రేషన్ బియ్యం ఉండడంతో వాటిని తనిఖీ చేయగా వాస్తవాలు ఉండడంతో వీటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరగదు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లకపోవడంతో వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వో. ఆర్ ఐని వివరణ కోరగా బియ్యం పట్టుకున్న మాట వాస్తవమేనని వాడి పోలీస్ స్టేషన్కు తరలించామని శుక్రవారం ఉదయం పంచనామా నిర్వహించి పూర్తి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. కాగా వారం గడవకు ముందే వడ్డేపల్లి కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం యథేచ్ఛగా కొనసాగుతుండడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం వ్యాపార ఇష్టారాజ్యం ఫలితంగా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రైస్ మిల్లర్లకు అందడంతో వ్యాపారులు కూడా వారిని ప్రోత్సహించి బియ్యాన్ని సేకరించి అక్రమంగా రవాణా చేస్తూ కోట్లకు పడగా లేపుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై జిల్లా ఉన్నతాధికారులు. మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం ద్వారానే ప్రతినిత్యం రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగులోకి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వడ్డేపల్లి కేంద్రంగా ఉన్న రైస్ మిల్లు తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెల్లోకి వస్తాయని రైతులు ప్రజలు పేర్కొంటున్నారు.