కనితిని చంపిన నిందితుల అరెస్ట్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 26):
నల్లమల అడవి ప్రాంతంలో స్వేచ్ఛగా విహరిస్తున్న వన్యప్రాణుల కు వేటగాళ్ల ముప్పు తప్పడం లేదు వన్యప్రాణి కనితిని హతమార్చిన నిందితులను అటవీశాఖ అధికారులు బుధవారం అరెస్టు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటన గురువారం నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపింది స్థానిక ఆటవిశాఖ రేంజర్ చంద్రశేఖర్ కథనం ప్రకారం కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల అమరగిరి సెక్షన్లో ఏలూరు శివారులోని ఎం జి కే ఎల్ ఐ జీరో పాయింట్ మంగళ దూప్ పెంట ప్రాంతంలో ప్రాంతంలో వేటగాళ్లు ఉచ్చు బిగించి కనితిని హతమార్చారు. చంపిన కనితి మాంసాన్ని విక్రయిస్తుండగా తమకు కచ్చితంగా సమాచారం అందిన వెంటనే బుధవారం సాయంత్రం అమరగిరి గూడెంకు చెందిన చెంచు నిమ్మల వెంకటస్వామి, బోరబండ తండా కు చెందిన దశావత నరసింహ, అనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి గురువారం స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుమార్, నాగార్జున గౌడ్, కిరణ్ కుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు ఉన్నారు.