లగ చర్ల రైతులపై అరెస్టు చేయడం హేయమైన చర్య.

లగ చర్ల రైతులపై అరెస్టు చేయడం హేయమైన చర్య.

 

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:

 

లగచర్ల రైతులపై అరెస్టు చేయడం హేయమైన చర్య బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి. అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్ల లో దళిత గిరిజన రైతులకు మాకు ఫార్మాసిటీ వద్దు మా భూములను మేము ఇవ్వమని చెప్పినందుకు రైతులను అరెస్టు చేసి 35 రోజులు జైల్లో పెట్టడం దారుణమన్నారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ నానా హింసలకు గురి చేయడం తో ముగ్గురు రైతులకు అనారోగ్యానికి గురికాగా మరో రైతు హీర్య నాయక్ కు గుండెపోటు రావడం ఆ రైతుకు బేడీలు వేసి హాస్పిటల్ కి తీసుకువచ్చి వైద్య పరీక్ష నిర్వహించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఫార్మాసిటీ వద్దు మా భూములకు మాకు కావాలని అన్న పాపానికి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ లో ఇలాంటి చర్యలకు పూనుకోవడం హేయమైన చర్య భావిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికి రైతుల వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అని లగచర్ల విషయంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా స్పీకర్ టైం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అన్ని విధాల రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని రైతులకు రైతుబంధు రైతులకు సరిగా రుణమాఫీ చేయక పోవడం,పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రైతులకు సాయం అందించకపోవడం ప్రతి విషయంలో రైతులను మోసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతుందన్నారు.లగ చర్ల రైతులకు న్యాయం చేసేంతవరకు బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రివర్యులు కేటీఆర్, హరీష్ రావు, చెప్పడం జరిగిందని. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనిదీనిని రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వారి కుటుంబాలకు దృష్టిలో ఉంచుకొని బేషరతుగా వారిపై పెట్టిన కేసులు కొట్టివేసి వారిని విడుదల చేయాలన్నారు. లగచర్ల రైతులకు న్యాయం చేసేంతవరకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment