అరెస్టులు అప్రజాస్వామికం.
సీఐటీయూ.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్..
కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో గ్రామ పంచాయితి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా,కనీసం నిరసన కూడా తెలపకుండా జిల్లా వ్యాప్తంగా నాయకులను, కార్మికులను అరెస్టులు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధం అని, ఈ చర్యను ప్రజాతంత్ర, లౌకిక శక్తులు, మేధావులు ఖండిచాలని సీఐటీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు యం. రాంబాబు, నెమ్మా ది వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయితి కార్మికులు ప్రభుత్వ అనుమతి పొంది హైదరాబాద్ ధర్నా కు వెళుతుంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అరెస్టులపై పత్రికా ప్రకటన విడుదల చేశారు.టీ ఆర్ ఎస్ ప్రభుత్వ కాలం లో సమస్యలు పరిష్కారం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే సమస్యలు పరిష్కారం చేస్తుందని గంపేడాశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. అమలు లో మాత్రం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తుందని అన్నారు. పారిశుద్య కార్మికులుగా తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించటం లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారికి పని భద్రత, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత గాని లేవన్నారు. గ్రామ పంచాయితి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు మరింత ఐక్యత తో పోరాటలు చెయ్యాలని సీఐటీయు జిల్లా కమిటీ అధ్యక్షులు యం. రాంబాబు పిలుపు నిచ్చారు.