*తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 14వ రోజు నిర్వాదిక సమ్మెలో భాగంగా*
మహా యజ్ఞం నిర్వహించారు. సీఎంకు హామీ గుర్తు చేసుకోవాలి.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు 14వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం వందరోజుల గ్యారెంటీ ఏమైందని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సమగ్ర శిక్ష ఉద్యోగం రెగ్యులర్ చేయాలని లేవనెత్తిన ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు ప్రజా పాలనలో ఆడపడుచులు రోడ్లమీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న న్యాయం జరిగేది ఎప్పుడు అని, ఇది నా ప్రజాపాలనని ప్రశ్నించారు. లక్షల మంది విద్యా భోజనం దూరమై, విద్యా వ్యవస్థ ఆగిపోయిన ప్రభుత్వం పట్టించకపోవడం పోషణీయమన్నారు, ఇప్పటికే బోధన, బోధన్ ఇతర పనులు ఆగిపోయినయని, ఎంఈఓ కార్యాలయాలకు తాళాలు పడ్డాయని, భవిత సెంటర్లు బంద్ అయ్యాయని అయినా ప్రభుత్వం పై మండిపడ్డారు.
ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో బిల్లు పెట్టి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్టు హామీ ఇవ్వగలరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే కేజీబీవీ నాన్ టీచింగ్ వాళ్లను వస్తే విద్యార్థులను ఇంటికి పంపించి డి ఈ ఓ తాళాలు ఇస్తామని. విద్యార్థుల పట్ల, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి సరికాదని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పోరాటంలో పాల్గొంటే జరిగా పోయే పరిణామానికి ప్రభుత్వమే అది ప్రభుత్వ బాధ్యతలేనని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి,శైలజ, దామోదర్, వీణ,సాయిలు లావణ్య, శ్రీను, మాధవి, గంగ ప్రసాద్, బన్సీలాల్, దినేష్ లింగం, కృష్ణ, సంధ్య మరియు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు