ఇస్మాయిల్ ఖాన్ గూడ శ్రీనివాస్ నగర్ కాలనీలో అసోసియేషన్ ఎన్నికలు

ఇస్మాయిల్ ఖాన్ గూడ శ్రీనివాస్ నగర్ కాలనీలో అసోసియేషన్ ఎన్నికలు

మొత్తం 10 సీట్లుండగా పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తూ 10 సీట్లను కైవసం చేసుకున్న బద్రి అండ్ టీం

(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి / డిసెంబర్ 1 : పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్ ఖాన్ గూడ వార్డు నెంబర్ వన్ పరిధి శ్రీనివాస్ నగర్ లో ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బద్రి అండ్ టీం 10 సీట్లలో పోటీ చేయగా మొత్తం 10 సీట్లకు 10 సీట్లు గెలుపొందినారు. శ్రీనివాస్ నగర్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా బద్రి హేమంత్ , ఉపాధ్యక్షులు గా సి.మోహన్,పి సోమేష్ ప్రధాన కార్యదర్శిగా నోముల నాగరాజు సంయుక్త కార్యదర్శిగా పి సంతోష్ రెడ్డి కోశాధికారిగా పి ప్రవీణ్ కుమార్ కార్యనిర్వాహక సభ్యులుగా సీతారాములు ఆర్ సతీష్ సాక్షులుగా బి శ్రీనివాస్ ఏ శ్రీధర్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా గెలుపుతున్న అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ వాసుల సహకారంతో కాలనీ అభ్యున్నతికి పాటుపడతామని కాలనీ వాసుల అందర్నీ కలుపుకొని కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment