బాలాజీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద..

బాలాజీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద..

21 వారం జ్ఞానమాల..

తెలంగాణ కెరటం మేడ్చల్ మల్కాజ్గిరి, జనవరి

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక బాలాజీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ మహనీయులకు ఆదివారం 21వ వారం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్వై అశోక్ మాదిగ, బహుజన యుద్ధనౌక ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, ముఖ్య అతిథులుగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు అర్పించి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు, వీరితోపాటు ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్, ప్రేమలత శ్రీనివాస్, కల్లెపెల్లి సదానంద్, మరియు ఎమ్ఎస్పీ నాయకులు, కేశపాక రామచందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బచ్చలకూర స్వామి మాదిగ, కళాకారుడు గజ్జెల్లి రామచంద్ర మాదిగ, ఎమ్మార్పీఎస్ జవహార్ నగర్ అధ్యక్షులు కోయడ వెంకటేష్ మాదిగ, వడ్డేపల్లి శివకుమార్ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, ఎస్పీ సెల్ అధ్యక్షులు ఆనంద్గారి ప్రకాష్, బి ఎస్పీ నాయకులు బిర్రు యాకస్వామి మాదిగ, మాజీ ఎంపీటీసీ, మొగిలిపాక పరశురాములు, కోఅప్షన్ సభ్యులు గండి నరసయ్య మాదిగ, బిఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గాదే రమేష్, కళకారుడు గడ్డం గిరి,
కోయడా వెంకటేష్, విజయ శంకర్, తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వాహకులు మహంకాళి బిక్షపతి ముఖ్య అతిథులకు శాలువలతో సత్కరించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునె బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment