యాసంగి పంటల్లో చీడపీడల నివారణ పై అవగాహన.
శాస్త్రవేత్త మాలతి చీడపీడల గురించి తెలిపారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:
మెదక్ జిల్లా రామయంపేట రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు సాంకేతిక విధానం ద్వారా నేరుగా వ్యవసాయ అనుబంధ రంగ సాంకేతిక అంశాలపై అవగాహనలో భాగంగా ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక విభాగం శాస్త్రవేత్త శ్రీమతి మాలతి యాసంగి సీజన్లో వివిధ పంటలలో సోకేటువంటి చీడపీడల నివారణ మరియు సస్యరక్షణ చర్యలతో పాటుగా సమగ్ర సస్యరక్షణ చర్యలను వివరించడం జరిగింది.అనంతరం వివిధ రైతులకు సంబంధించి సోకేటటువంటి చీడపీడలు వాటి నివారణ పద్ధతుల గూర్చి అవగాహన కల్పించడం జరిగింది అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సమగ్ర చీడపీడల నివారణ కేంద్రం మరియు భారత వ్యవసాయ శాఖ పరిధిలో గల డైరెక్టర్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారెంటైన్ స్టోరేజ్ కార్యాలయం మరియు జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ మొబైల్ యాప్ రైతులకు మరియు క్షేత్రస్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలకు మరియు రైతులకు వివిధ పంటల్లో సోకేటువంటి చీడపీడల చిత్రాల సేకరణ వాటిని మొబైల్ యాప్ ద్వారా సేకరించి అధికారులకు పంపించి వాటికి తగినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలను పొందే విధంగా ఈ యాప్ అందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా చీడపీడల గుర్తింపు వాటి చీడపీడల నిఘా మరియు సాంకేతిక సలహాలతో పాటు చీడపీడల యజమాన్య పద్ధతులను ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఈ యాప్ ద్వారా రైతులకు చీడపీడలను ముందుగానే గుర్తించడం వాటిని సమర్థవంతంగా అరికట్టడం ఒక ప్రాంతం నుంచి చీడపీడల వ్యాప్తిని అరికట్టడం క్షేత్రస్థాయిలోని అధికారులకు చీడపీడల పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం ఈ చీడపీడలపై పూర్తి సమాచారం ఉన్నప్పుడు రాష్ట్రస్థాయిలో వీటి నివారణ కోసం సమగ్ర ప్రణాళిక రచించడం వంటివి ఈ యాప్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరే అవకాశము ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయికృష్ణ ప్రవీణ్ సందీప్ మరియు రైతులు పాల్గొన్నారు.