---Advertisement---

క్షయ వ్యాధి నిర్మూలనకు అవగాహన సదస్సులు నిర్వహించాలి

---Advertisement---

క్షయ వ్యాధి నిర్మూలనకు అవగాహన సదస్సులు నిర్వహించాలి

 

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 30 : క్షయ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ కోరారు. కోరుట్ల మండలంలోని ఏరియా ఆసుపత్రిలో క్షయ విజేతలకు టీబి అలర్ట్ ఇండియా, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలపై వివరించారు. గతంలో క్షయ వ్యాధికి గురై సంపూర్ణంగా చికిత్స వాడి కోలుకున్న టీబీ ఛాంపియన్స్ (క్షయ విజేత)లు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిపిఎం కట్ట హరీష్, టీబీ సూపర్‌వైజర్‌ ఇమ్రాన్, ఆంజనేయులు, ఆకుల మల్లికార్జున్ , టీబీ అలర్ట్ ఇండియా జిల్లా బాధ్యులు దాసరి అనిల్, శ్రీనివాస్ తదితరులున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment