---Advertisement---

ఖేడ్ :ముఖ్యమంత్రి పై మండిపడ్డ బంజారా నాయకులు

---Advertisement---

ఖేడ్ :ముఖ్యమంత్రి పై మండిపడ్డ బంజారా నాయకులు

 

తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 13

 

లగచర్ల గిరిజన రైతుల పైన ఈ ప్రభుత్వం వారి భూమిని బలవంతంగా లాక్కోవడమే కాకుండా వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో బంధించిన విషయం తెలిసిందే.సంగారెడ్డి జైల్లో రిమాండ్ లో ఉన్న గిరిజన రైతు హీర్యానాయక్ గారికి గుండెపోటు రాగా వారిని ఆసుపత్రికి సకాలంలో తరలించకపోగా తరలించే క్రమంలో ఒక కరుడుగట్టిన నేరస్థుడు టెర్రరిస్టు మాదిరిగా సంకెళ్లు వేసి ఆసుపత్రికి తరలించడంపై గిరిజన నాయకులు మండిపడ్డారు.ముఖ్యమంత్రి  తన అల్లుడి కోసం గిరిజనుల భూములు అక్రమంగా లాక్కోవడానికి చూడడమే కాకుండా వారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి వారు ఒక కరుడుగట్టి నేరస్తుల మాదిరి వారిని చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రయత్నాలు మానుకోకపోతే మా గిరిజన ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేస్తూ ఈ కాంగ్రెస్ నాయకులను ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీర్యానాయక్ గారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి  సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి దౌర్జన్యాలు గుండాగిరి పరిస్థితులు నెలకొంటే రాష్ట్ర మొత్తం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని. రాష్ట్రంలో తీవ్ర అలజడి నెలకొంది అని మా గిరిజనుల పైన ఇటువంటి అఘాయిత్యాలు జరిగిన మేము సహించే ప్రసక్తి లేదు అని ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ సర్పంచులు రాజు నాయక్, రవీందర్ నాయక్, విట్టల్ రావు, సాయిలు, మాజీ ఎంపీటీసీలు రాజు నాయక్, జిల్లా నాయకులు లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, నాయకులు సర్దార్ నాయక్, వెంకట్, శ్రీనివాస్, రాందాస్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment