అటవీ భూముల హక్కు దారులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి.

అటవీ భూముల హక్కు దారులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి.

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (డిసెంబర్

నాగర్ కర్నూల్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హక్కు పత్రాలకు బ్యాంకులో రుణాలు ఇవ్వాలని గిరిజన రైతులు బ్యాంకు చుట్టూ తిరిగిన రుణము పొందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ఆదిలాబాద్, వరంగల్, జిల్లాలో సాగు చేసుకున్న రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చారని, అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో గ్రీన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అనేక జిల్లాల్లో హక్కు పత్రాలు పొందిన ఆదివాసి గిరిజన బిడ్డలకు రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఉంటే ఈ జిల్లాలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పోడు భూముల హక్కు పత్రాలు పొందిన ప్రతి రైతుకు బ్యాంకు ద్వారా ఇవ్వాలని కోరారు. జిల్లాల్లో 12 వేల ఎకరాలు గిరిజనులు సాగు చేస్తున్నారని గత ప్రభుత్వము 2006 అటువైపుల చట్టం ప్రకారం 2000 మందికి మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నదని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పరిపాలన పూర్తయిందని ఇప్పటికైనా గిరిజనులను ఆదివాసులను గుర్తించి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు అందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు. సొంత జిల్లా అయిన నాగర్ కర్నూల్ లో నల్లమల్ల ప్రాంతానికి గుర్తించి సమస్యల పరిష్కారం కోసం చొర్వ చూపాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ హక్కులు కాలర్ వేయకుండా జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి గిరిజనులకు న్యాయం చేయాలని విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కే విధంగా ప్రభుత్వము గిరిజనుల పక్షాన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి న్యాయం చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలను ఖాళీ చేసి అడుగులలో ఉండే మైనింగ్ ఖనిజ సంపాదన కోసం గిరిజనులను నిస్సహాయులుగా చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశమ అనీ ప్రశ్నించారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, నాయకులు వాల్య నాయక్, వ్యాకాస నాయకులు, నాగరాజు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment