---Advertisement---

ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలి

---Advertisement---

ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలి

డయల్‌ 100 కాల్స్‌ పై తక్షణమే స్పందించాలి

తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామాలలో విధిగా పర్యటించాలి

వార్షిక తనిఖీల్లో భాగంగా చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్ తనిఖీ

జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్

తెలంగాణ కెరటం:మెదక్ జిల్లా బ్యూరో:నవంబర్ 29:

మెదక్ జిల్లా ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది ముందుండి డయల్‌ 100 కాల్స్‌ పై తక్షణమే స్పందించాలని సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితలకు న్యాయం చేయాలనిఅలాగే సిసి కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, మరియు పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ0లో 5s అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీల గురించి అడిగి తెలుసుకు న్నారు.పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. రికార్డ్ రూమ్,రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాల ను తిరిగి క్షుణ్నంగా పరిశీలించా రు.విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ,స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు.నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరగాలపై వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయు తంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, చిలిపి చేడ్ ఎస్.ఐ. నర్సింలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment