ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిసి తెలంగాణ ఉద్యమ నేత అబ్బగోని అశోక్ గౌడ్
తెలంగాణ కెరటం ఆర్మూర్ ప్రతినిధి జనవరి
సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ గోని అశోక్ గౌడ్
మాట్లాడుతూ
త్వరలో జరగనున్న అదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనునట్టు అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ నేతగా, బీసీ ఉద్యమ నేతగా సుపరిచితుడిగ ఉన్నానని, గత 10 సంవత్సరాలుగా బీసీల కోసం పోరాడుతున్నానని తెలియజేశారు.
బిసి నిరుద్యోగుల పక్షాన ఎల్లవేళలా పోరాడుతానని అనుక్షణం గ్రాడ్యుయేట్స్ పక్షాన నిలబడతాని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు.
జ్యోతిబాపూలే సావిత్రిబాయి ఆశయ సాధన కోసం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్టు అశోక్ గౌడ్ తెలియజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని. బిసీ పట్టభద్రుల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుగా మారతానని
అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్లా సురేష్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బిజ్జారం అంబదాస్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు
భూస మహేష్, తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు వెంకటేష్
మరియు రాష్ట్ర బీసీ నాయకులు సూరి నీడ దశరథ్ , జీవన్ గౌడ్, భువనేశ్వర్, రాజేందర్ గౌడ్
తదితరులు బిసి నాయకుల