దాతృత్వాన్ని చాటిన బెజ్జంకి గ్రామ ప్రజలు

దాతృత్వాన్ని చాటిన బెజ్జంకి గ్రామ ప్రజలు

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి

సంక్రాతి పండుగ రోజున రోడ్డు ప్రమాదానికి గురైన మండల కేంద్రానికి చెందిన ఎల్లంపల్లి యువకుడు బోనగిరి మహేందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అతని కుటుంబ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే అని తెలిసిన బెజ్జంకి గ్రామ వాసులు, అతని ఆరోగ్యం కోలుకోవాలని కాంక్షిస్తూ, ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాతల సహాయం ద్వారా వచ్చిన 90,000 రూపాయల నగదును బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య ఆధ్వర్యంలో, మహేందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా రావుల నర్సయ్య మాట్లాడుతూ, పేద కుటుంబానికి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగే రూపేశ్, సంగెం మధు, కొత్త రాజ్ కుమార్, కరాటే శ్రీను, బోనగిరి రూపేష్, గుండని ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment