నెల్లుట్ల వెంకటేశ్వరరావుకుఉత్తమ సేవా పురస్కార సత్కారం.

నెల్లుట్ల వెంకటేశ్వరరావుకుఉత్తమ సేవా పురస్కార సత్కారం.

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జానపద సంక్రాంతి జాతీయ కవి సమ్మేళనం సోమవారం విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయంలో జాతీయ చైర్మన్ యు.వి.రత్నం ప్రోగ్రాం డైరెక్టర్
డా.ధనాసి ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ హిందు పరిషత్ మహా సంఘ్ ఇంచార్జి డా. మద్ది శెట్టి సామేలు చేతులమీదుగా సూర్యాపేటకు చెందిన నెల్లుట్ల వెంకటేశ్వరరావుకు జాతీయ సంక్రాంతి కళారత్నం అవార్డు అందజేసి ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు.
అదేవిధంగా తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ తరుపున సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గా నెల్లుట్ల వెంకటేశ్వరరావును నియమిస్తు చైర్మన్ డా. యు.వి.రత్నం డైరెక్టర్ డా.ధనాసి ఉషారాణి నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవాచారి, విశ్వామిత్ర ప్రసాద్ శేషగిరిరావు పలువురు స్నేహితులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment