---Advertisement---

పేటలో భానుపూరి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం .

---Advertisement---

పేటలో భానుపూరి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం .

 

పదిరోజుల పాటు సాగనున్న క్రీడలు… రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన 27జట్లు .

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 .

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి క్రీడాకారుడు క్రీడాస్పూర్తిని అలవర్చుకోవాలని భానుపురి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 రాష్ట్ర స్థాయి పోటీల మొదటి బహుమతి లక్ష రూపాయల దాత శ్రీరామ్ సాయిరాం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన భానుపూరి ప్రీమియర్ లీగ్ సీజన్1 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకోని తమ ఆటకు పదును పెట్టుకోవాలన్నారు. ఎలాంటి మేనేజ్మెంట్ కమిటీ లేకుండా లక్ష రూపాయల బహుమతితో పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి క్రీడలు ఏర్పాటు చేసుకున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. పది రోజుల పాటు జరగనున్న ఈ క్రీడలకు రాష్ట్ర వ్యాప్తంగా 27జట్లు రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీరాం సాయిరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులంతా కలసి భారీ కేక్ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి దాత గ్లోబల్ కంటి ఆసుపత్రి వైద్యులు నాతాల క్రాంతికుమార్రెడ్డి, ఉయ్యాల ఉపేందర్, హెడ్ కానిస్టేబుల్ బోస్క సుధాకర్, ఆర్గనైజర్స్ సతీష్, శ్రీకాంత్ తో పాటు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment