శెట్పల్లి గ్రామానికి చెందిన తుమ్మల మహేష్ కుమార్ కు భారత్ సేవ పురస్కార్ అవార్డు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 10 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల మహేష్ కుమార్ కు భారత్ సేవా పురస్కార్ అవార్డు మానవ హక్కుల కౌన్సిల్ జాతీయ చైర్మన్ కొప్పుల విజయకుమార్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు,రాష్ట్ర చైర్మన్ నర్సింగ్, ప్రొఫెసర్ రాములు, హైకోర్టు న్యాయవాది కడారి రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ హనుమగౌడ్,విజయ పటేల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వీఆర్వో లింగం చేతులమీదుగా భారత్ సేవా పురస్కార్ తుమ్మల మహేష్ కుమార్అవార్డు మంగళవారం రోజున హైదరాబాదులోని తెలంగాణ పరిషత్ కళాభవన్ లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ఈ అవార్డునుఅందజేశారని,అవార్డు అందుకున్న తుమ్మల మహేష్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా అవార్డు అందుకున్న తుమ్మల మహేష్ కుమార్ మాట్లాడుతూ, కరుణా ట్రస్ట్ఏర్పాటు చేసి,అత్యుత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు,కరుణ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు భారత్ సేవ పురస్కార్ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని, ఈ అవార్డు దక్కడం పట్ల, ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన,ఎవరికి, ఏ,ఆపద వచ్చిన వెంటనే స్పందించి,వారికిమరింత సేవా కార్యక్రమాలు చేపడతానని తుమ్మల మహేష్ కుమార్ పేర్కొన్నారు.