ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కు మంత్రి పదవి ఇవ్వాలని నేతల బైక్ ర్యాలీ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 15):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎంఎల్ఏ వంశీకృష్ణ కు జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో వంశీకృష్ణ కు మంత్రి పదవి ఇవ్వగలరని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బాల్మూర్ మండల నాయకులు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ చైర్మన్ వొంగ గిరివర్ధన్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ కాశన్న యాదవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్,. కిసాన్ సెల్ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ ఖదీర్,.మండల యూత్ అధ్యక్షుడు తవిటీ అశోక్. మరియు సీనియర్ నాయకులు. యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని మండల కేంద్రము నుంచి నాయనపల్లి మైసమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కుకున్నారు.