కార్యకర్త వివాహ వేడుకకు హాజరైన బిజెపి నాయకులు సురభి నవీన్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 18 : ఇబ్రహింపట్నం మండలం ఎర్ధండి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన ఎర్దండి గ్రామ బీజేపీ కార్యకర్త కాయిపెల్లి రవీందర్ వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైయం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.