మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్ సంతాపం.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్ సంతాపం.

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 27):

మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్  మరణం పట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీసీసీ డెలిగేట్ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ మన్మోహన్ సింగ్  చిత్రపటానికి ఘనంగా నివాళులర్పిచారు.
ఈ సందర్భంగా తంగల్పల్లి రవికుమార్ మాట్లాడుతూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం.
విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో చట్టాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు.
దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
మన్మోహన్ సింగ్ గారి చిత్తశుద్ది, ప్రజాసేవ పట్ల అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో , టి పి సి సి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రఫీ ఉద్దీన్ గౌరీ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిట్టి , భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంగా కృష్ణ, మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూచాలా స్వామి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చుక్క స్వామి, గుమ్మడల్లి రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మంగా ప్రవీణ్, అసెంబ్లీ అధ్యక్షుడు వాసుదేవ్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు గోదా చిన్న శ్రీనివాస్ గౌడ్, గోమారి ఎల్లారెడ్డి, ఆదర్శ రైతు సంఘం అధ్యక్షులు ములుగు లక్ష్మయ్య, కొత్త బాల్రాజ్, మైనారిటీ నాయకులు షేక్ షానూర్ బాబా, మొహమ్మద్ కరీం, మొహమ్మద్ హుజూర్ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోగుల యాదగిరి, పెండం సుదర్శన్, శ్రీనివాస్ మెడిగే, హమాలీ సంఘం నాయకులు తుమ్మల రాజు కార్మిక నాయకులు హమాలీ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించి సంతాప ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment