గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
–మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 21,
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామంలో గల ఎరాయి చెరువులో శనివారం రోజు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని మర్కుక్ మండల ఎస్ఐ దామోదర్ తెలిపారు.వారు మాట్లాడుతూ గుర్తు తెలియని మృతదేహం గజ్వేల్ మార్చురీలో ఉంచడం జరిగిందని,ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే,మర్కుక్ మండల పోలీసులను సంప్రదించాలని,ఎవరికైనా వివరాలు తెలిసినచో క్రింద తెలిపిన నంబర్ కు 8712667341 కాల్ చేసి తెలపగలరని మర్కుక్ మండల ఎస్సై ఓ.దామోదర్ తెలిపారు.