ప్రతీ రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు రూ.15,000 ఇవ్వాలి: బి ఆర్ యస్ పార్టీ
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతీ రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 2 పంటలకు రైతులకు సహాయం అందించక పొగా ఇప్పుడు ఎకరాకు రూ.12,000 మాత్రమే ఇస్తామంటూ మాట మార్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారం రైతులకు మద్దతుగా ఈరోజు భువనగిరి పట్టణం లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రతి రైతుకు ఎకరాకు 15 వేల రూపాయలు మరియు కౌలు రైతులకు మరియు రైతు కూలీలకు పెట్టుబడి సాయం చేయాలని లేనియడల రైతుల పక్షాన పోరాటం చేస్తామని, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భువనగిరి పట్టణం లో బిఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.