కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మ దహనం 

కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మ దహనం 

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 19;

 

పార్లమెంటులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానపరిచే విధంగా బిజెపి నాయకుడు కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి గారి పిలుపుమేరకు ఈరోజు భువనగిరి పట్టణంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది…. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , అమిత్ షాను కేంద్రం మంత్రివర్గం నుంచి తొలగించాలని మరియు అంబేద్కర్ గారి గురించి చులకనగా మాట్లాడినందుకు దేశ .. ప్రజలందరికీ క్షమాపణలు చెప్పవలసిందిగా, పార్లమెంటు ముందు ముక్కు నేలకు రాయాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది…..ఇట్టి నిరసన కార్యక్రమం ఎన్ ఎస్ యు ఐ నేషనల్ డెలిగేట్ ఎడమ పవన్ నాయకత్వంలో చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు నోముల తరుణ్,ఎస్ పల్లెపాటి ,నితిన్ ,నివస్ పులుగం ఆర్య , దుర్గాప్రసాద్,సాయి , శరత్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment