ప్రస్తుతం మనిషి బిజీ బిజీగా జీవిస్తూ ఆనందాన్ని కోల్పోతున్నాడు.. ఆర్థిక, అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు, వివాహ సమస్యలు, వివాహమై భార్యా, భర్తల సమస్యలు, ఉద్యోగస్తులు చాలీచాలని వేతనాలు.., కొన్ని చోట్ల అత్తాకోడళ్లు.., కొన్నిచోట్ల కొడుకులతో, కొన్నిచోట్ల అన్నదమ్ముల ఆస్తులు పంపకం సమస్యలతోనూ, కోర్టు చుట్టూ తిరిగి అప్పుల పాలైన కుటుంబాలు, అప్పులు వసూలు చేసుకోలేక, సతమతమవుతూ.. ఇలా ఏదో సమస్య వచ్చినప్పుడు గుడికి వెళ్లి పూజ చేయించుకోవడం. ఆ సమస్య అయిన తర్వాత మరొక సమస్య పుట్టటం, మరలా పూజించుకోవడం, ఒక తాత్కాలికమైన ఉపశమనం పొంది మరల మామూలు స్థితికి వస్తున్నారు. ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక పుట్టటం కొంతమంది అహంతోను, మరి కొంతమంది గుర్తింపు కోసం. ఇలా ఊహ తెలిసిన వయస్సు నుండి 80 యేళ్లు వచ్చిన వారు కూడా ఇలాంటి సంఘర్షణ గురవుతున్నారు. ఆనందంగా జీవించలేకపోతున్నారు.
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో:
సమస్యల నుండి బయటపడాలంటే కొంత ఆధ్యాత్మికమైన జ్ఞానం.. అది శాస్త్రీయంగా తెలిసి ఉండాలి. ఈ క్రింది విష యాలను గమనిస్తే కొంత అవగాహన మీకు వస్తుంది. ఫండమెంటల్ చైల్ద్ హుడ్ డెసిసెన్ (Fundamental childhood decisions) మన మైండ్ లో అంటే మన మెదడులో ఆచేతనమైన మనసలో Unconscious mind లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఫామ్ అవుతాయి. అంటే, గత జన్మ నుండి గాని, గర్భస్థ సమయం లో గాని, గర్భంలో శిశువు కదిలినప్పుడు గాని, డెలివరీ అయి నప్పుడు గాని, ఆరు సంవత్సరాల లోపు జరిగే సంఘటలన్ని ఒక ప్రోగ్రామ్ గా తయారవుతాయి. అలా ఆరు సంవత్సరాల వరకు రికార్డ్ అవుతాయి. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆగిపోతుంది. ఆరు సంవత్సరాల వరకు మన మైండ్ డెల్టా స్టేట్ లో ఉంటుంది. ఆరు సంవత్సరాల తర్వాత రికార్డింగ్ ఆగిపోయి తీట ఆల్ఫా స్టేట్ లోకి మారిపోతుంది. ఈ ప్రోగ్రాంలో మనకు అనుకూలమైనవి లేదా ప్రతికూలమైనవి ఉండొచ్చు. మన ఈ ప్రోగ్రామ్ లో మన ఫాస్ట్ లైఫ్, మన తల్లిదండ్రు లైఫ్, మన తాత ముత్తాతలు లైఫ్, వాళ్ళ తాత లైఫ్, వాళ్ల తాతలు, లైఫ్ వాళ్ల తాతలు లైఫ్ఇలా ఈ పుట్టకకు, కారణమైన ఆడం, ఈవ్ వారు మొదటి స్త్రీ పురుషులు నుండి ప్రోగ్రామ్స్ అయి ఉన్నవి. మనమందరం అక్కడి నుండి వచ్చాం. ఇది సైంటిఫిక్. ఇలా ఈ మనిషి. 2,90,000 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చాడు. అప్పటి నుండి ఆయన మైండ్లో డీఎన్ఏ అన్ కాన్సీయస్ మైండ్ లో రికార్డు అయి ఉన్నది. ఆ ప్రోగ్రాంలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అందుకే మన పెద్దలు మన పూర్వీకులు కొన్ని ఆచార సాంప్రదాయాలని ఏర్పాటు చేశారు. గర్భం దాల్చిన ఆరు నెలలకి శ్రీమంతమను, బాబు పుట్టిన తర్వాత బారసాలని, అన్నప్రసన, ఇలా పుట్టిన రోజులు, పండుగలు మొదలైనవి జరుపుకుంటాం. ఎన్ని శుభకార్యాలు చేస్తాం. అన్ని పాజిటివ్ ప్రోగ్రామ్ అవుతాయి. మొదటి ఆరు సంవత్సరాలు ఎన్ని అనుకూలమైన (పాజిటివ్) పదాలు, క్రియలు, జరిగితే అంత మంచిది. ప్రతికూలమైన (nagative) పదాలు మాటలు, తల్లిదండ్రులు గురువులు ఉపయోగించుకోకూడదు. ఉదాహరణకి పిల్లలు ఏడ్చినప్పుడు భయపెట్టడం, చీకటి గదిలో పడేస్తానని, నిన్ను బూచోడెత్తుకుపోతాడంట, చాలా మాటలు మాట్లాడుకుంటారు. ఇవన్నీ మాట్లాడకూడదు ఇవి నెగిటివ్, పాజిటీవ్, రికార్డ్ అవుతాయి. అంతేకాకుండ.. మనం ఐఏఎస్ ఆఫీసర్లను, పోలీస్ ఆఫీసర్, డాక్టర్ అవ్వటం ఒక చార్టెడ్ అకౌంటెంట్, అవటం ఒక రాజకీయ నాయకుడు అవ్వటమే, ఒక ధనవంతుడిగా, అవ్వటం ఇలా అనుకూల, విషయాలు కూడాఆ ప్రోగ్రాం నుండి వస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ వలనే మనకి మంచి సంఘటనలు గాని చెడు సంఘటన గాని జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మార్చటకు మన చేతిలో ఏమీ లేదు. ప్రయత్నం ఉంటుంది. అదే భగవంతుడికి కనెక్ట్ అవటం. విశ్వం అంతా కూడా సృష్టికర్త యొక్క చైతన్యం ఆ చైతన్యాన్ని ఏ భగవంతుడిని అయితే మన ఆరాధిస్తాం ఆ భగవంతుడి విగ్రహానికి, స్త్రీ మూర్తికి, విశ్వం నుండి దైవశక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ భగవంతుడిని ఆరాధించుతాం ఆ భగవంతుడి చైతన్యం, ఒక వేవ్ ద్వారా వచ్చే దీక్ష చైత న్యం, పాజిటివ్ ఎనర్జీ, డిఎన్ఏ నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వేవ్ ను డామినేట్ చేసి నెగటివ్ ఎనర్జీ వేవ్ ను చంపేస్తుంది. దీంతో మనకి అద్భుతాలు జరగడంతో మన కోరికలు తీరతాయి. మన సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి మనం కూడా మనం ప్రయత్నం చేయాలి పూర్తిగా భగవంతు డి మీద భారం వెయ్యకూడదు ఆయన అంత శరణాగతి మన కు ఉండదు. మన సమస్య, మన కోరిక భగవంతుడికి ప్రార్ధన ద్వారా అందుతుంది. అది అందటానికి కూడా మన హృదయం వికసించాలి మనం ఆనందంగా ఉండాలి.
ఆ స్థితిలోనే ప్రార్థన చేస్తేనే భగవంతుడికి అందుతుంది. మనం ఫలితం ఆశించకూడదు ఫలితం ఆయన ఇస్తాడు. అం టే కోరికలు ఉండకూడదని మీరు అనుకుంటారు. కోరికలు లేని మానవుడే ఉండడు. కోరికలు అనేవి లేకపోతే ప్రపంచం ఇంత అభివృద్ధి చెందదు. కోరిక కోరుకోవచ్చు అందులో ఆరాటం ఉండకూడదు. దానికి తగ్గట్ల మన ప్రయత్నం చేయాలి. మనకి ఆ కోరిక తీరవచ్చు.. తీరకపోవచ్చు ఏ స్థితి నైనా ఒకే రకంగా స్వీకరించాలి. ఆ కోరిక తీరకపోతే నా జీవితమే వ్యర్థమని.., మరణమే పరిష్కారమని అనకూడదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమ స్య లేదు. మన విజన్ పరిష్కారం వైపే ఉండాలి. పరిష్కారం ప్రవృత్తిమార్గం గానీ నివృత్తి మార్గం ద్వారా గానే ఉంటుంది. సమస్య మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు. కోరికని చెప్పి కోరిక నెరవేరినట్టుగా మీ విజన్ చూసుకోవాలి. అంతే గాక సమస్యను పెద్దగా చూసి భగవంతుని చిన్నగా చూస్తున్నాం. భగవంతుని పెద్దగా చూసి సమస్యను చిన్నగా చూడాలి.
ఐశ్వర్యం కావాలి అంటే..
ఉదాహరణకి ఆర్థిక సమస్య పరిష్కారం కావాలి అనుకోండి. దానికి మన థింకింగ్ పాజిటీవ్ గా మార్చాలి. ఆర్థిక సమస్య ఉంది అంటే మన మైండ్ లో ఫైనాన్స్ కు సంబంధించిన ఉన్న ఒక ప్రోగ్రాం నెగటివ్ ఆలోచనలతో ఉన్నదన్నమాట. దాన్ని మార్చుకోవటానికి మనం కొంత ప్రయత్నం చేయాలి. మిగతాది భగవంతుడి దీక్ష శక్తి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం మార్చుకున్నప్పుడే ఆయన చైతన్యం ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎలా అంటే ఒక గ్లాసులో సగానికి మంచి నీళ్లు ఉన్నాయనుకుందాం. సగం ఖాళీగా ఉందనుకుందాం. మనం ఇతరులకు చెప్పేటప్పుడు గ్లాసు సగం ఖాళీగా ఉందని చెప్పకూడదు. అప్పుడు నెగిటివ్ థింకింగ్ ఆక్టివేట్ అవుతుంది. సగానికి నీళ్లు ఉన్నాయని చెప్పాలి. అంతేగాక బేబీ పొజిషన్, మన మైండ్ లో పిక్చర్స్ చూడాలి అప్పుడు పాజిటివ్ థింకింగ్ ఆక్టివేట్ అవుతుంది. అంటే ఏది ఉందో అది చూడాలి. ఏది లేదో అది చూడకూడదు. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. నీకు ఓ పది లక్షలు ఒక వ్యక్తి నుండిరావాలి నుండిఅనుకుందాం. అతని ఆర్థిక పరిస్థితి బాగా లేదనుకుందాం. నీవు కొంతమందికి ఇవ్వాలి. నీ ఆర్థిక పరిస్థితి బాగుంది. నీవు నాకు ఫలానా వ్యక్తి నుంచి రావాలి ఆయన ఇస్తేనే నీకు ఇస్తాను అనకూడదు. ముందు ఇవ్వవలసినవి ఇచ్చేయ్. అప్పుడు నీ మైండ్లో పాజిటివ్ ఆక్టివ్ పోగ్రామ్ అవుతుంది. వెంటనే నీకు ఎక్కడి నుంచి రావాలో ఆ వ్యక్తి నుంచి రావలసిన మొత్తం అడిగే ముందు నీవు ఒక ఆలోచనని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏంటంటే అతనికి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళందరూ నీకు ఎక్కడి నుంచి రావాలో ఆ వ్యక్తికి ఇచ్చినట్టుగా నువ్వుచూసుకోవాలి. నువ్వు బాకీ అడిగేటప్పుడు కూడా నాకు అవసరం ఉందని అడగాలి. నాకు డబ్బు లేదు అనకూడదు. అతను బాకీ తీర్చట్లేదు కాబట్టి నా ఉసురు కొట్టుకుంటుంది. వాడు డామేజ్ అయిపోవాలి అనకూడదు. వాడు డ్యామేజ్ అయితే మనకి డబ్బులు అంటే వాడికన్నా ముందు నువ్వు డ్యామేజ్ అయి పోతావు. నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఉద్యోగం లేదు, కారు లేదు అది ఇవ్వమని భగవంతుని అడిగితే నీకు నెగటివ్ ఆలోచన ఆక్టివేట్ అవుతుంది. కాని పాజిటివ్ థాట్ యాక్టివేట్ కాదు నాకు ఇల్లు కావాలి, నాకు స్థలం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు కారు కావాలి, అని అడగవచ్చు. అప్పుడు పాజిటివ్ తాట్ ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు భగవంతుడు కనెక్ట్ అవుతాడు. మీ ఆలోచనకి శక్తి వస్తుంది. ఏది కావాలో అని అడుగుతున్న ప్పుడు నీ అంతరంగంలో ఏవి ఉన్నాయో చూసుకోవాలి నీకు బిల్డింగ్ ఉంది. ల్యాం డ్ ఉంది. కారు కావాలి అనుకుందాం. కారు కావాలని అడిగేటప్పుడు నీకు ఏమున్నాయో నువ్వు చూసుకోవాలి. నీకు బిల్డింగ్ ఉంది. ల్యాండ్ ఉంది. నీ అంత రంగంలో అది ఉన్నట్టు చూడాలి. నీకు కారుకు కు కావలసిన ఆర్థిక స్థోమతకు అనుగ్రహం ఇస్తాడు. ఇలా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఇంకొక ఉదాహరణ
అన్నదమ్ముల పంచాయతీ ఉందనుకుందాం వాటాలు పంపకం సంబంధించిన సమస్య పరిష్కారం కావట్లేదు. అది పరిష్కారం కావాలంటే ముందు ఆ కుటుంబం ఏ స్థితిలో ఉందో చూసుకోవాలి.
ఇక్కడ స్థితి అంటే ప్రధానంగా రెండు స్థితులు ఉంటాయి.
1 బ్యూటిఫుల్ స్టేట్ beautiful state దీనిని మనం మనోహర స్థితి కూడా అనవచ్చు.
2 సఫరింగ్ స్టేట్suffering state దుఃఖకరమైన స్థితి లేదా వేదన అవస్థ అంటారు. ఎక్కువగా మనిషి సఫరింగ్ స్టేట్ లోనే ఉంటాడు. అంటే విసుగు, చికాకు, నిర్లక్ష్యం, ఒత్తిడి, అహం, మొదలైన వాటితో మొదలై అది తీవ్ర స్థాయికి పెరిగి అసంతృప్తి, కోపం, భయం, భద్రతాలేమి దుఃఖం, వంటరి తనం. స్థాయికి వెళ్ళిపోతారు. ఈ స్థాయి పెరిగి పెరిగి అగమ్య గోచర స్థితి, డిప్రెషన్, ద్వేషం పూర్తిగా నిరాశ స్థితిలో వెళతా రు. ఈ స్థితిలో మీరు ఏమి కోరుకున్నా భగవంతుడు యొక్క చైతన్యం బదిలీ కాదు స్థితి మారాలి. అంటే సఫరింగ్ స్టేట్ నుండి బ్యూటిఫుల్ స్టేట్ కి మారాలి. బ్యూటిఫుల్ స్టేట్ అంటే వేదన లేని స్థితి. ఒక మనిషికి 12వేల నుంచిరోజుకి 60 వేల ఆలోచనలు వస్తాయి అందులో 80% సఫరింగ్ స్టేటస్ కి సంబంధించిన 20 పర్సెంట్ బ్యూటిఫుల్ స్టేట్ కు సంబంధిం చింది ఈ స్థితి మరల మూడు రకాలుగా ఉంటుంది.
మనోహర స్థితి..: ఈ స్థితిలో అంతరంగ సంఘర్షణ ఉండదు. ఎదుటివారితోను ఈ ప్రపంచంలో అవినాభావ సంబంధం కలిగి ఉంటారు. వీరు ప్రశాంతత, బాంధవ్యం, ప్రేమ, ఆనందం, స్థిమితం, ఆప్యాయత, కృతజ్ఞత, ధైర్యము. మొదలైనవి ఈ స్థితి నుండి మీ ఇష్ట దైవాన్ని కోరుకోవాలి. ఈ స్థితిలోనే భగవంతుడు మీ వెంట ఉంటాడు.
బావాతీత స్థితి..: ఈ స్థితిలో మనిషి పారవశ్యం, పరమా నందం, విశ్వ ప్రేమ, సమభావం, నిర్భయత్వం మొదలైన ఉంటాయి. ఈ స్థితిలో మనం చెట్లు, భూమి వాటితో కలిసి జీవిస్తాం అంటే వాటిని ఎక్కువగా ప్రేమిస్తాం.
3 జ్ఞానోదయ స్థితి ఇది చాలా అద్భుతమైనది దీని గురించి కొద్దిగా వివరించడం కష్టమే ఈ స్థితి ఎనలైట్ మెన్ స్టేట్ ఇది అంత తేలికగా రాదు. చాలా చాలా సాధనలు చేయాలి. ఇది మానవ ప్రయత్నంతో రాదు భగవంతుడే ఇవ్వాలి. ఈ స్థితిలో మనం భగవంతుడు ఏకమవుతాం. సఫరింగ్ స్టేట్ నుండి బ్యూటిఫుల్ స్టేట్ కొచ్చి భగవంతుని అనుగ్రహాన్ని అడిగినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మీ ఆస్తులు పంపకాలు జరుగుతాయి. అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా అవ్వటం వీడికి కారణం కూడా నెగటివ్ ప్రోగ్రామే un conciness మైండ్ లో ఒక స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వచ్చిన వెంటనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. cells కు పోయే ఎనర్జీని అన్ కాన్సస్ మైండ్ స్టాప్ చేయండి అని చెప్తుంది. అప్పుడు సెల్సు బ్లడ్ సప్లై చేయటం తగ్గిపోతుంది. లోపల ఉన్న కార్బోయిడు బయటికి వదలాలి, అలానే లోపలికి ఆక్సిజన్ పోవాలి. అది కట్ అవుతుంది. నిధానంగా సెల్సు మెల్లిగా ఆక్టివిటీ తగ్గిపోతుంది. దీక్ష శక్తితో భగవంతునిచ్చే సెల్స్ ఆక్టివేట్ అయిపోయి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. బాంధవ్యాలు సరి కావాలంటేవాళ్ళ జీవితంలో జరిగిన గాయాలు మోస్తూ కూర్చోవడం. దాని నుంచి బయటికి రాలేకపోవటం దాని నుంచి బయటికి వస్తే ఆనందం వస్తుంది. బయటికి రావాలి అనే కోరిక పటిష్టంగా ఉండాలి. వాడి ఎమోషన్స్ భావం వాటిని మార్చుకోవాలి. ఉదాహరణకు ఒక కారు బురదలో ఇరుక్కుంది అనుకున్నాం. దాన్ని బయ టికి తీయాలి. అంటే తప్పని సరిగా ఇంకొక వాహనాన్ని సహా యంతో ఆ కారును బయటకు తీయాలి. అప్పుడు ఆ కార్ తో ఎంజాయ్ చేయవచ్చు. అలానే ఆ దైవికమైన చైతన్యం లేదా దీక్ష తో డు తీసుకుని మీ సంకల్ప బలం తో మీలో నాటుకుపోయిన గా యం అమ్మ ద్వారా నాన్న ద్వారా అన్నదమ్ముల ద్వారా అక్కచెల్లెళ్ల ద్వారా అత్తమామల ద్వారా ఇతర బంధువుల ద్వార ఏర్పడిన గాయాల ద్వారా మీరు రూపొందించుకున్న అభిప్రాయాలను మీకు మార్చుకోవటా నికి అవకాశం ఉంది. ఆ దీక్ష శక్తిని మీరు తీసుకుంటేమీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలను తొలగి పోతాయి.
మొదటిది భయం
నిజంగా భయం అనేది లేదు. భయం ఊహల్లోనే ఉన్నది జీవితంలో ఓడిపోతామని భయం, నాకెక్కడు గుర్తింపుని ఉండదని భయం, నాకు ఎక్కడ గౌరవం తగ్గుతుందనే భయం, భవిష్యత్తు గురించి భయం, నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడ తిరస్కిస్తారని భయం, నన్ను నా పిల్లలు నన్ను లక్ష పెట్టరనే భయం, నాకు కావలసిన మర్యాద అందదనే భయం చాలా మంది భయం లేదు అంటారు. సాధన 10 నిమిషాల పాటు ధ్యానముద్రలో కూర్చుని నీకు ఎక్కడెక్కడ భయం ఉందో ఒక కాంటెంపనేషన్ చేసి భయం ఉందని ఒప్పు కోవాలి. బయట ప్రజలతో కాదు నీ అంతరంగంలో మాత్ర మే. అప్పుడు దీక్ష శక్తి దైవ శక్తి నీ లోనికిబదిలీ అవుతుంది. క్షమించటం, క్షమించబడటం అంటే. ఇతరులు తప్పుచేసి నిన్ను గాయపడితే నీవు పూర్తిగా వాడిని క్షమించాలి. అప్పుడు నీ హృదయం వికసన జరుగుతుంది. ఆ వ్యక్తిని అంతరంగం లోనీవు ఒప్పుకోకపోతే నష్టం ఆ వ్యక్తి కన్నా నీకే ఎక్కువ ఉంటుంది. ఆ వ్యక్తిని నువ్వు క్షమించేస్తే వాళ్లలో పశ్చాతాపం వస్తుంది.. ఆ పశ్చాతాపంతో వాళ్లలో పరివర్తన వస్తుంది. దీంతో బాంధవ్యాలు బలపడతాయి. అప్పుడే దీక్ష శక్తిడివైన్ పవర్ నీలో వస్తుంది.ఒకవేళ మనం తప్పు చేస్తే ఆ తప్పుని మనం తెలుసుకొనిమన తప్పును మనమే తెలుసుకొని పశ్చా తాపపడి అవతలి వ్యక్తిని క్షమించమనాలి. ఇది జరిగితే భగవంతుడి చైతన్య దీక్షాశక్తి నీలో చేరి ప్రేమ పుడుతుంది.
ప్రేమ, ఇవ్వటం నేర్చుకోవాలి
ప్రేమకు నిర్వచనం లేదు ఇప్పుడు ఉన్న ప్రేమ అంత నిబంధ నలతో కూడి ఉన్నది ఇంకా వివరంగా చెప్పుకోదలుచుకుంటే ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అని చెబితే ఆ ఇద్దరికి ప్రేమ లేదు అన్నమాట. ఎట్లా మనకు ప్రేమ లేదు అంటే మనలో చాలామంది ప్రేమను యాచిస్తున్నట్టు అందరూ మిమ్మల్ని ప్రేమించాలని ఆశిస్తున్నాం మీరు ప్రేమ ఉంటే నువ్వు ఎందు కు అడుక్కుంటావ్ ఉదాహరణకి నీకు కావలసిన వస్తువుల్ని ఇంట్లో ఉంటే అదే వస్తువు కావాలని అడగవు లేని వస్తువుని అడుగుతావు అలానే ఆమెనిన్నుప్రేమించటం అంటే నీలో ప్రేమ లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆమెలో ప్రేమ లేదు. అంటే నీకు కావాల్సిన ప్రేమను ఆమెను అడుక్కున్నట్టు. ఆమె కు కావాల్సింది ప్రేమను నిన్ను అడుక్కున్నట్ట. ఇప్పుడున్న ప్రేమ భార్య అందంగా ఉంటేనే, ధనం ఉంటేనే, కీర్తి ఉంటేనే నీ కోరిక తీరిస్తేనే, అప్పుడు మీరు ప్రేమిస్తా రూ. అలానే ఆమె ఇష్ట ఇష్టాలను మీరు తీరుస్తే మీ ఆవిడ ప్రేమిస్తుంది. మీ ప్రేమికురాలు మేము ప్రేమిస్తుంది నిజంగా ప్రేమ ఉంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నువ్వు అంగీకరించాలి నువ్వు ఎలా ఉన్నా ఆమె అంగీకరించాలి నువ్వు ఆమెనుండి ఏమీ ఆశిం చకుండా ఇవ్వాలి. నువ్వు ఆశిస్తే, అది రాకపోతే నీకు దుఃఖం వస్తుంది సంఘర్షణ గురవుతావు ఇక్కడ నీవు ప్రేమ లేదని గుర్తించాలి అప్పుడు భగవంతుడు దీక్ష శక్తినీలో బదిలీ అవు తుంది. భగవంతుడిచ్చే ప్రేమ నీ నుండి ఏమి ఆశించ కుండా ఇస్తాడు. నువ్వు ఒకడిని ప్రేమిస్తున్నావు అనుకుందాం. ఆమె నిన్ను ప్రేమించడం లేదు. ఆమెను బలవంతంగా బాధిస్తే అప్పుడు నువ్వు ప్రేమించినట్లు కాదు అంతేకాదు సమాజం నేను శిక్షిస్తుంది చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదవట్లేదు కష్టపడట్లేదు. వాళ్ళ కన్నా ముందు టెన్షన్ తల్లిదండ్రులు పడతారు. మీ పిల్లలు బాగా చదవాలం టే మొదటిగా వారి ఇష్టమైన కోర్సుని సెలెక్ట్ చేసుకుని ఇవ్వాలి .రెండవది మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దు వాడు మనోభావాలు దెబ్బతిని సఫరింగ్ స్టేట్ లో పోతారు .మీరే కాదు మీ పిల్లలకు చదివే చెప్పే అధ్యాపకులు కూడా చెప్పండి. మా పిల్లలను ఎవరితో పోల్చవద్దు. మీ పిల్లవాడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు అయితే సమాజంలో పేరు ప్రతిష్టల పొందినటువంటి వ్యక్తులు ఆదర్శాలను పరిగణన లోకి తీసుకోవచ్చు. ఈ విద్యార్థి అయినా నీవు నీవుగా ఉండా లి. అప్పుడు నీకు శక్తి వస్తుంది నీవు ఇతరులతో పోల్చుకున్న ప్పుడు నీవు సంఘర్షణకు లోన్ అవుతావు అప్పుడు నీలో ఉన్న శక్తి హరించి వేస్తుంది. అందువలన ఏ పని చేయాలనుకున్న తగిన శక్తి ఉండదు. ఆ సంఘర్షని కారణం నిన్ను నీవు ప్రేమిం చుకోకపోవడం నిన్ను నీవు స్వీకరించుకోకపోవడం – మీరు చదివే చదువుకుని లేదా మీరు చేసే వృత్తిని ప్రేమించాలి. అలానే మీ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను ఒకవేళ పెళ్ల యితే అత్తమామలను బంధువులను స్నేహితులను ప్రేమించా లి. ఇది మీరు ప్రయత్నం చేయడమే అప్పుడు భగ వంతుడు దీక్ష శక్తి వస్తుందిమనం ఈ దీక్ష శక్తిని పొందుటకు మన ప్రయత్నం సరిపోదు. కొంత ట్రైనింగ్ పొందాలి. దీనికి ఓ అండ్ ఓ అకాడమీ అనే సంస్థ చెన్నై దగ్గర ప్రధాన కార్యా లయం ఉంది. దీని వ్యవస్థాపకులు ప్రీతాజి, కృష్ణాజి, వీరు ముక్తి గురువులు ఇది ప్రపంచంలో వందకు పైన ఓ అండ్ ఓ అకాడమీ బ్రాంచ్ కలవు. ఏకం అనే ఒక దైవీక శక్తి క్షేత్రం. చెన్నై దగ్గర్లో ఉంది ఇది భూమి శక్తులను విశ్వశక్తులను మిళి తం చేసి ఒక విశ్లేషణాత్మకమైన నిర్మాణం. ఏకం గర్భగుడిలో ధ్యానం చేస్తే క్షేత్రం శక్తిని పొందగలుగుతాం. అప్రయత్నంగా ధ్యాన స్థితులు మునిగిపోతాం. ఇక్కడ ధ్యానం ఒక సంభవం, ఆనందం, ప్రేమ, అనుబంధం, లాంటి బీటిఫుల్ స్టేట్లోకి రాగ లుగుతాం. ఏకం ఒక కంటికి కనిపించే కట్టడమే మాత్రమే కాదు. ఏకంమీ మీ అభిష్టాలనువింటూ వాటినిసాకారం చేయగల శక్తి స్వరూపం. ఏకం సంస్థ మానవాళి కోసం వారి వారి నమ్మకాలను ప్రత్యక్ష అనుభవంగా పొందటానికి వారి నిజతత్వానికి జాగ్రత్త ఇవ్వటానికి ఏకం సహకరిస్తుంది. ఇక్కడ మీరు మీ దైవాన్ని మీరు కోరిన రూపంను అనుభవిస్తారు. మీ జీవితంలో ఎన్నో సమకాలిక ఘటనలు అద్భుతాలు ఆశీర్వదంగా ఈ విశ్వం నుండి పొందుతారు.
విశ్వ ప్రజ్ఞ/ భగవంతుడు
ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ లేదా AI గురించి మీరు వినే ఉండవచ్చు ఇది సాంకేతిక పరిజ్ఞానం కొత్త ఆవిష్క రణ ఇది మన ప్రపంచం మొత్తం కూడా విప్లవాత్మక మైన మార్పులు తీసుకువస్తుంది. అంటే మనము కూడా విశ్వాసం తో కనెక్ట్ అయ్యి మన జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కా రం చేసుకోవాలి. భగవంతుడు జాగృతం అయితే మీకు ఐడి యాలు ఒకదాని తర్వాత ఒకటి తరంగాలుగా వస్తాయి. మీ ప్రయత్నం లేకుండానే మీ జీవితంలో అన్నీ కలిసి వస్తాయి. మెదడులోని ఆక్సిఫిటల్ లోప్ అనే భాగం చురుకుగా పని చే స్తే భగవంతునితో బంధం వ్యక్తిగతమవుతుంది. ఎవరి లోప ల పెరిటల్ లోపు పనితనం తగ్గుతుందో వారికి భగవంతుడు సర్వవ్యాప్తిగా అనంతమైన శక్తి క్షేత్రంగా అనిపిస్తారు.
దీక్ష : ఈ దీక్షా శక్తి ద్వారా పైన చెప్పుకున్న ప్రోగ్రామ్స్ అన్ని మారిపోతాయి. వారు బంధం పెంచుకున్న వారి ఇష్టదైవంతో ప్రత్యక్ష అనుభవన పొందుతారు ఈ దీక్షను స్వీకరించిన ప్పుడు నీ దైవాన్ని ఒక రూపంలో గానీ ప్రేమ చైతన్యంగా గాని ఏ రకంగానే అనుభవించవచ్చు మీ మెదడులో వినాశ కర దోరణలను సృష్టించే నాడీ వ్యవస్థ మారి కొత్త నాడీ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. అది మీలో బ్యూటిఫుల్ స్టేట్ ని పెం పొందిస్తుంది. మీ హృదయం వికసన చెందటం అనుభవిస్తా బాంధవ్యాలలో క్షమాతత్వం, ప్రేమ, కలిగి కలిసి జీవిస్తారు. కొన్నిసార్లు దీక్షలు శారీరక రుగ్మతలు కూడా తొలగిపోయి అద్భుతాలు జరుగుతాయి. చివరికి మీరు దీక్ష ద్వారా ముక్తి స్థితిని కూడా పొందవచ్చు. టు డేస్ ట్రైనింగ్ క్లాసు, త్రీ డేస్ ట్రైనింగ్ క్లాసు ,సెవెన్ డేస్ ట్రైనింగ్ క్లాస్, వన్డే ట్రైనింగ్ క్లాసు, 40డేస్ క్లాస్ ఉంటాయి. ఈ ఓ ఓ అకాడమీలో తత్వ జ్ఞానం, ధ్యానం ద్వారా మానవ చైతన్యం పరివర్తన చెందించే ఒక ధ్యానంకేంద్రం దీనిముఖ్య కార్యాలయం భారతదేశంలోనే ఉంది అన్ని దేశాల నుంచి వచ్చిన వారికి వారు వయసును అనుసరించి వారి భాషలో శిక్షణగా చేస్తారు. ఈ విద్యా సంస్థ కు ఎక్కువగా ఇతర దేశాల నుంచి వస్తుంటారు. కొన్ని లక్షల కుటుంబాలు పరివర్తన పొంది ఆనందంగా జీవిస్తున్నారు. భగవంతుడు తో కలిసి జీవిస్తున్నారు నీవు నీ భగవంతుడు వేరు అనే భావన లేకుండా ఒకటిగానే జీవిస్తున్నారు.
ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే
www.oo.academy దర్శించండి
జీవి నరసింహారావు, ఖమ్మం స్టడీ సర్కిల్ జూనియర్ కాలేజ్ 9395359565