సంక్రాత్రి కానుకగా క్రికెట్ టోర్నమెంట్ బి వి పి యల్
తెలంగాణ కెరట కౌడిపల్లి ప్రతినిధి జనవరి 15
మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, బుజిరంపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సంక్రాంతి పండుగ సందర్భంగా గత మూడు రోజులుగా గ్రామ యువకులు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో నాలుగు టీం లు పాల్గొనగా విన్నర్ గా కౌడిపల్లి గోపాల్ టీం, రన్నర్ గా వంగపల్లి వెంకటేశం టీం నిలిచారు.ఈ క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్ మరియు రన్నర్ లకు రఘువీరా రెడ్డి, వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ సర్పంచ్ లు యాదాగౌడ్, లక్ష్మణ్ లు , పట్లోల సిద్ది రాములుల చేతుల మీదుగా బహుమతుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రఘువీరా రెడ్డి, వెల్మకన్న మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, మాజీ సర్పంచ్ లు యాదాగౌడ్, లక్ష్మణ్, పట్లోల సిద్ది రాములు , మంగలి మధు, గాజుల నర్సింలు, ముక్క అనిల్, తునికి రమేష్, ముక్క పెంటయ్య, కౌడిపల్లి గోపాల్, వంగపల్లి వెంకటేశం, మహిపాల్, మహేందర్, కమ్మరి కృష్ణ, నెల్లి రమేష్ బుజిరం పేట, వెంకటాపూర్ , పీర్యా తాండా యువకులు పాల్గొన్నారు.