కోరుట్ల వెటర్నరీ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్
ఈఏంఆర్ఐ ఆధ్వర్యంలో ఎంపిక
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 12 : ఈ నెల 11,న కోరుట్ల వెటర్నరీ కళాశాలలో హైదారాబాద్ జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ 1962 మొబైల్ ఆంబులెన్స్ క్లినిక్‌లలో వెటర్నరీ డాక్టర్లుగా విధులు నిర్వహించడానికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ఈ రిక్రూట్మెంట్ కు ఈఎంఆర్ఐ సంస్థ తరపున ప్రతినిధులుగా సంస్థకు చెందిన తెలంగాణా ప్రాజెక్టు హెడ్ డా.బాగీశ్ మిశ్రా, జగిత్యాల జిల్లా 108 సర్వీసుల మేనేజర్ వి.రాము పాల్గొన్నారు. కళాశాల తరపున ప్రతినిధులుగా ప్రొఫెసర్లు డా.నాగరాజు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా.రాధాక్రిష్ణ బృందం అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ కు హాజరయిన కోరుట్ల,వరంగల్ వెటర్నరీ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 49 మంది ఉద్యోగాలకు ఎంపికయినట్లు కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ డా.దాసరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంపికయిన విద్యార్థులను కళాశాల ప్రొఫెసర్లు మరియు భోదనేతర సిబ్బంది అభినందించారు.